Pallavi Prashanth, : రైతు బిడ్డకే ఎక్కువ ఓట్లు వేస్తున్న ప్రేక్షకులు.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది వాళ్లేనా?

by Hamsa |   ( Updated:2023-09-14 10:00:30.0  )
Pallavi Prashanth,  : రైతు బిడ్డకే ఎక్కువ ఓట్లు వేస్తున్న ప్రేక్షకులు.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది వాళ్లేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ సీజన్ 7 ప్రారంభమవగా ఇందులో 1 4 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. వారిలో మొదటి వారం సీనియర్ హీరోయిన్ కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయి వెళ్ళిపోయింది. రెండో వారం నామినేషన్స్ రసవత్తరంగా జరిగాయి. నామినేట్ అయిన వారిలో ఈ సారి ఏకంగా తొమ్మిది మంది ఉన్నారు. బిగ్‌బాస్ 7 తెలుగు రెండో వారం అత్యధిక ఓట్లతో పల్లవి ప్రశాంత్, హీరో శివాజీ, గౌతమ్ కృష్ణ, శోభా శెట్టి, , అమర్ దీప్ చౌదరి, రతిక రోజ్, షకీల, టేస్టీ తేజ, ప్రిన్స్ యావర్ నామినేట్ అయ్యారు. వీరిలో అందరితో పల్లవి ప్రశాంత్ ఎక్కువగా టార్గెట్ అయ్యాడు.

అతన్ని తొమ్మిది మంది నామినేట్ చేశారు. ప్రశాంత్‍పై స్టార్ మా సీరియల్ బ్యాచ్ అయిన అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభా శెట్టి విరుచుకుపడ్డారు. వాళ్లకు ఆట సందీప్, రతిక రోజ్ సపోర్ట్ కూడా చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్లలో ఇప్పటివరకూ చూసుకుంటే పల్లవి ప్రశాంత్‌కే ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్లు పడుతున్నాయట. పల్లవి ప్రశాంత్‍ 39.56 శాతంతో టాప్‍లో ఉండగా రెండో స్థానంలో శివాజీ 20.93 శాతం ఓట్లతో ఉన్నాడు. ఇక అమర్ దీప్ చౌదరికి 17.94 శాతం, రతికకు 8.18 శాతం, గౌతమ్ కృష్ణకు 3.21 శాతం, ప్రిన్స్ యావర్ 3.06 శాతం, శోభా శెట్టి 2.51 శాతం, షకీలకు 2.34 శాతం, టేస్టీ తేజ 2.28 శాతం ఓట్లు నమోదు అయ్యాయి. ఇలాగే ఓటింగ్ ఫ్లో కొనసాగితే చివరి రెండు స్థానాల్లో ఉన్న షకీల లేదా టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. అతడు తప్పించుకుంటే.. షకీలా, శోభా శెట్టిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed