ఈసారి ముందే పసిగట్టిన పల్లవి ప్రశాంత్.. రతికతో ఎలా బిహేవ్ చేస్తున్నాడో తెలుసా?

by Anjali |   ( Updated:2023-10-27 09:35:54.0  )
ఈసారి ముందే పసిగట్టిన పల్లవి ప్రశాంత్.. రతికతో ఎలా బిహేవ్ చేస్తున్నాడో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన రతిక రోజ్ మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదట్లో ఇటు పల్లవి ప్రశాంత్‌తో అటు యావర్ ప్రిన్స్‌తో డబుల్ గేమ్ ఆడుతూ ఆడియన్స్ వద్ద నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. హౌస్‌లో రతిక ఓవర్ యాక్షన్ చూడలేక ఫ్యాన్స్ ఎలిమినేట్ చేశారు. కాగా రీఎంట్రీ ఇచ్చిన రతిక హౌస్‌లో శివాజీ, యావర్‌లతో క్లోజ్‌గా ఉంటుంది. అలాగే పల్లవి ప్రశాంత్‌కు దగ్గరవ్వాలని చూస్తుంది. కానీ అది వర్కౌట్ కావట్లేదు. ప్రశాంత్ రతికను దూరం పెడుతున్నాడు. నిన్న (అక్టోబరు 26) ఎపిసోడ్‌లో రతికను.. ప్రశాంత్ అక్క అని పిలిచినా.. అక్క అని పిలవాల్సిన అక్కర్లేదని ఆమె అన్నది. లేదు నేను అక్క అనే పిలుస్తానని ప్రశాంత్ అన్నాడు.

ఇక శివాజీ ఈ విషయంలో జోక్యం చేసుకొని.. అక్క అని అనకులేరా అన్నాడు. ‘ఆడియన్స్ ఎవరికి ఫేవర్‌గా ఉన్నారో రతిక వారితో క్లోజ్‌గా మూవ్ అవ్వాలని చూస్తుంది. ఈమె ప్లాన్ ఆ మాత్రం అర్థం అవ్వని జనాలు ఎవరు లేరు ఇక్కడ. మళ్లీ ఈ డబుల్ గేమ్ చూస్తే, నెక్ట్స్ వీక్ ఎలిమినేట్ అయ్యే చాన్స్ కనిపిస్తుంది. మాటలతో కాకుండా టాస్కుల్లో పర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల వద్ద మార్కులు కొట్టేస్తే బెటర్’’ అంటూ సోషల్ మీడియాలో జనాలు రతికపై మండిపడుతున్నారు.

Advertisement

Next Story