Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ప్రేక్షకులకు బిగ్ షాకిచ్చిన నాగార్జున.. రతిక, దామిని, శుభ శ్రీ రీ ఎంట్రీ..?

by Prasanna |   ( Updated:2023-10-15 11:10:11.0  )
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ప్రేక్షకులకు బిగ్ షాకిచ్చిన నాగార్జున.. రతిక, దామిని, శుభ శ్రీ రీ ఎంట్రీ..?
X

దిశ,వెబ్ డెస్క్: బిగ్ బాస్ సీజన్ 7 కొత్త రూల్స్ తో మన ముందుకొచ్చిన విషయం మనకి తెలిసిందే. గుర్తుపెట్టుకోండి.. ఇక్కడ ఏమైనా జరగొచ్చు.. ఇది ఉల్టా పుల్టా సీజన్ అంటూ ముందు నుంచి నాగార్జున చెప్తూనే ఉన్నారు. వీకెండ్‌లో వచ్చి ఏదొక బాంబ్ పేల్చుతూనే ఉన్నారు. అయితే శనివారం ఎపిసోడ్‌ ప్రోమోలో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఎలిమినేట్ అయ్ వెళ్లిపోయిన రతిక, దామిని, శుభశ్రీలు రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ముగ్గురూ వచ్చారు కానీ వాళ్లు కంటెస్టెంట్స్‌గా అయితే కనిపించడం లేదు.. వాళ్ల చేతుల్లో లగేజ్ బాగ్స్ ఏమీ లేవు కాబట్టి.. వాళ్లు గెస్ట్‌గా వచ్చినట్టే కనిపిస్తుంది. లేదంటే.. మళ్లీ వీళ్లకి ఏదైనా టాస్క్ పెట్టి తద్వారా ఈ ముగ్గురిలో ఒక్కరికో ఇద్దరికో రీ ఎంట్రీ ఛాన్స్ ఇస్తారా? అన్నది ఆసక్తిగా మారింది.

పోయిన వారం హౌస్‌లోకి ఐదుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చారు కాబట్టి.. ఇప్పుడు ఒకేసారి ముగ్గుర్ని రీ ఎంట్రీ‌ ఇవ్వడంతో అందరూ షాక్ అవుతున్నారు. కానీ ఈ ముగ్గురిలో ఒకరికైనా బిగ్ బాస్ రీ ఎంట్రీ ఇచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ ముగ్గురిలో ఎక్కువ బ్యాడ్ అయ్యింది రతిక మాత్రమే.. బయటకు వెళ్లి బయట పరిస్థితులు చూసి వచ్చింది కాబట్టి.. రతికకి ఒక అవకాశం ఇస్తే.. పోయిన సారి చేసిన తప్పులను రిపీట్ కాకుండా చూసుకుంటుంది.

Advertisement

Next Story