Bigg Boss-7: నాగార్జున ఒక్క ఎపీసోడ్‌కు తీసుకునే రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్!

by Hamsa |   ( Updated:2023-09-27 08:53:18.0  )
Bigg Boss-7: నాగార్జున ఒక్క ఎపీసోడ్‌కు తీసుకునే రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగులో బిగ్‌బాస్ రియాలిటీ షో 6 సీజన్లు పూర్తి చేసుకుని దూసుకుపోతుంది. ఇటీవల సీజన్-7 స్టార్ట్ అయి నాలుగు వారాలు అవుతుంది. ఇక ఈసారి ఉల్టా పుల్టా అంటూ ఈసారి బిగ్ బాస్ షో ఆసక్తిగా సాగుతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. బిగ్‌బాస్‌కు హోస్టుగా చేస్తున్న నాగార్జున భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న తెలుస్తోంది. ఆయనకు బిగ్ బాస్ నిర్వాహకులు ఊహించని రేంజ్ లో పారితోషికం ఇస్తున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ షో 3వ సీజన్ నుంచి నాగార్జున హోస్టుగా నిర్వహిస్తున్నారు.

ఆయన గత సీజన్ల కంటే.. ఈ సీజన్ కు వచ్చే సరికి ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఎపిసోడ్ కు నాగార్జున ఒక కోటి రూపాయలు వసూలు చేస్తున్నారట. ఇక ఈ సీజన్ కనీసం 3 నెలలు ఉంటుంది. అంటే దాదాపు 12 వారాలకు పైగా నడుస్తుంది. శని, ఆదివారాల ఎపిసోడ్స్ కలుపుకుని అలా సీజన్ మొత్తం మీద ఆయనకు 20 కోట్ల పైనే రెమ్యూనరేషన్ అందుతుందని సమాచారం. ఈ షో కోసం నాగ్ 15 రోజులు కేటాయిస్తారట. ఈ విషయం తెలిసిన ప్రేక్షకులు షాక్ అవుతున్నారు.

Advertisement

Next Story