బిగ్‌బాస్-7: ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి ఆ కంటెస్టెంట్ అవుట్!

by Hamsa |   ( Updated:2023-10-28 09:09:46.0  )
బిగ్‌బాస్-7: ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి ఆ కంటెస్టెంట్ అవుట్!
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్-7 షో అందరిలో ఆసక్తిని పెంచుతోంది. ప్రతి రోజు హౌస్‌లో టాస్క్‌ల్లో పాల్గొంటూ ఎంతటి గొడవకైనా వెనకాడటం లేదు. అయితే ఈ షో వీకెండ్‌కు చేరుకుంది. ఈ వారం నామినేషన్స్‌లో.. శివాజీ, భోలె, అమర్ దీప్, సందీప్, శోభాశెట్టి, ప్రియాంక, గౌతమ్, అశ్విని ఉన్నారు. అయితే ఈ సారి శివాజీకి ఎక్కువ ఓట్లు పడటంతో సేఫ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక భోలె రెండో స్థానంలో ఉన్నాడట. అమర్ దీప్, అశ్విని, గౌతమ్, ప్రియాంక తర్వాత స్థానాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. సందీప్, శోభాశెట్టి మాత్రం సమానమైన ఓట్లతో డేంజర్‌ జోన్ ఉన్నారట. శోభాశెట్టి ఎలిమినేషన్ నుంచి తప్పించుకుందట. దీంతో సందీప్ మాస్టర్ ఈ వారం హౌస్ నుంచి బయటకు వచ్చేసాడని సమాచారం. దీంతో ఆయన ఫ్యాన్స్ షాక్‌లో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed