- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బిగ్‌బాస్-7: మరింత ఆసక్తికరంగా ఈ వారం నామినేషన్స్.. కంటెస్టెంట్స్ కత్తులతో పొడుచుకుంటూ(వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: ఈ సారి బిగ్‌బాస్ షో ఎంతో ఆసక్తికరంగా మొదలైంది. సెప్టెంబర్ 3 నుంచి ప్రసారమవుతుండగా ఇందులో 14 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. అయితే ఈ షో వచ్చి ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి అయింది. దీంతో నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. దీంతో ప్రస్తుతం హౌస్‌లో 10 మంది ఉన్నారు. ఈరోజు సోమవారం కావడంతో ఈరోజు నామినేషన్స్ జరుగుతాయన్న సంగతి తెలిసిందే.
తాజాగా, ఈ వారం నామినేషన్స్‌కు సంబంధించిన ప్రోమో వీడియో విడుదలైంది. శివాజీ తన పవర్ అస్త్ర కోల్పోయిన నేపథ్యంలో అతడు నామినేషన్స్ ప్రక్రియలో పాల్గొనాలి. ఇక టేస్టీ తేజా హోస్ట్ నాగార్జున చేత నేరుగా నామినేట్ చేయబడ్డాడు. కాబట్టి అతడు ఆల్రెడీ నామినేట్ అయ్యాడు కాబట్టి అతన్ని ఎవరు నామినేట్ చేయరు. కాబట్టి శివాజీ, ప్రియాంక, గౌతమ్, శుభశ్రీ, అమర్ దీప్, ప్రిన్స్ యావర్ నామినేషన్స్ ప్రక్రియలో పాల్గొంటారు. ఈ వారం నామినేట్ చేసే వ్యక్తి గుండెల్లో చాకు దించాలని బిగ్ బాస్ ఆదేశించాడు. ప్రతి కంటెస్టెంట్ మెడకు మందపాటి షీట్ తగిలించుకుని ఉంటారు. తగిన కారణాలు చెప్పి నామినేట్ చేసిన కంటెస్టెంట్ మెడలో ఉన్న షీట్ కి కత్తి గుచ్చాలి. ఇందులో గౌతమ్ కృష్ణ ఓ టాస్క్‌లో తేజ తనను బెల్ట్‌తో కొట్టిన సంగతిని గుర్తు చేశాడు.
ఆ టాస్క్‌లో తేజ అలా చేస్తుంటే ఆపలేకపోయారంటూ శివాజీని నామినేట్ చేశాడు. అలాగే సందీప్ కంటెస్టెంట్‌గా ఉండుంటే తననే నామినేట్ చేసేవాడినని, కానీ తన హౌస్‌మెంట్ అయినందున తనను ఛాన్స్ లేదన్నాడు. ఇక ప్రియాంక, యావర్‌కు మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. శివాజీ , అమర్ దీప్ మధ్య వార్ రసవత్తరంగా సాగింది. దీంతో ఈ వారం నామినేషన్స్‌లో సందీప్, శోభా శెట్టి, ప్రశాంత్ మినహా మిగతా ఏడుగురు నామినేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక విడుదలైన ప్రోమో లాస్ట్‌లో అందరూ గుండెల్లో కత్తులు గుచ్చుకుంటున్నట్లు చూపించారు. మరి ఈ వారం ఎవరు ఎవరిని నామినేట్ చేశారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే.