బిగ్‌బాస్-7: విన్నర్ పల్లవి ప్రశాంత్ నిజస్వరూపం బయటపెడుతూ మాజీ కంటెస్టెంట్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Hamsa |   ( Updated:2023-12-19 07:34:48.0  )
బిగ్‌బాస్-7: విన్నర్ పల్లవి ప్రశాంత్ నిజస్వరూపం బయటపెడుతూ మాజీ కంటెస్టెంట్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కప్పు గెలుచుకుని బయటకు వచ్చేశాడు. ఓ కామన్ మ్యాన్‌గా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన ఆట తీరుతో ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే కప్పుతో కారు టాప్ మీద కూర్చుని మరీ రోడ్ షో చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ప్రశాంత్ ఇంటర్వ్యూలు ఇవ్వమంటే యాంకర్లకు పలు కండీషన్లు పెడుతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా, పల్లవి ప్రశాంత్ ప్రవర్తనను విమర్శిస్తూ మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ శివ పలు పోస్టులు పెట్టాడు. ‘‘ ప్రశాంత్ 18 గంటలు వెయిట్ చేయించి ఇంటికి రా అన్నా ఇంటర్వ్యూ ఇస్తా అని పిలిచాడు. తీరా అక్కడికి వెళ్తే ఇంటి బయట 8 గంటలు కూర్చోబెట్టి ఇంటర్వ్యూ ఇవ్వను వెళ్ళిపోమని దురుసుగా మాట్లాడాడు. గొప్ప విన్నర్ ప్రశాంత్.. అక్కడే ఉన్న తన స్నేహితులను కూడా అతడు లెక్క చేయడం లేదు. ఇవన్నీ నాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదని పెట్టలేదు. ఇవ్వను అని చెప్పే విధానం బాలేదు’’ అంటూ వరుస పోస్టులు చేశాడు.









Advertisement

Next Story

Most Viewed