Bigg Boss Telugu 7: ఈ వారం ఇంటి నుంచి మరో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఔట్..

by sudharani |   ( Updated:2023-11-11 08:24:35.0  )
Bigg Boss Telugu 7: ఈ వారం ఇంటి నుంచి మరో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఔట్..
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ సీజన్ 7 రోజు రోజుకు ఎంతో ఉత్కంఠ బరితంగా సాగుతోంది. ఈ వారం మొత్తం ఫ్యామిలీ వీక్‌తో అదరగొట్టిన బిగ్ బాస్.. హౌస్ మేట్స్‌తో సహా ప్రేక్షకులను కూడా ఏడిపించేశాడు. నిన్న కెప్టేన్సి టాస్క్ జరగ్గా.. రేసులో శివాజీ, అర్జున్ ఉన్నారు. వారిద్దరిలో కెప్టెన్ ఎవరు అనేది తెలాల్సి ఉంది. ఇక ఈ వారం నామినేషన్స్ విషయానికి వస్తే.. రతిక రోజ్, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్, భోలే షా వలి, శివాజీ నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే.. ఈ వారం చివరి దశకు చేరుకోవడంతో ఇప్పటికే ఓటింగ్ సెక్షన్ కూడా పూర్తి అయింది. ఇందులో అతి తక్కువ ఓట్లు రావడంతో ఈ వారం భోలే ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది.

ఇక ఐదో వారంలో ఓ ఐదుగురు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వారిలో ఒకరు సింగర్ భోలే షా వలి. ఈయన ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి చాలా డిఫరెంట్‌గా ఉంటున్నారు. ఆయన మాటలు, డ్రెస్సింగ్‌ కూడా వెరైటీగా ఉండడం అందిరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా నామినేషన్స్ సమయంలో హౌస్ మెట్స్‌తో వ్యవహరించిన తీరు కొందరికి చిరాకు తెప్పించినా.. మరికొందరికి హాస్యం పండించింది. ఎవరు ఏం మాట్లాడినా పాటలతో సమాధానం చెప్పి భోలే అందరినీ ఆకట్టుకున్నారు.

Advertisement

Next Story