- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BIG BOSS OTT : హోస్ట్‌ను నామినేట్ చేసిన కంటెస్టెంట్
దిశ, సినిమా: బిగ్ బాస్ ఓటీటీ రసవత్తరంగా సాగుతోంది. కొంచెం కొత్తగా కూడా అనిపించింది. సాధారణంగా నామినేషన్ ప్రక్రియలో కంటెస్టెంట్‌ల మధ్య వాగ్వాదం జరుగుతుంది. కానీ ఇక్కడ కంటెస్టెంట్, హోస్ట్ కరణ్ మధ్య వివాదం జరిగింది. నామినేషన్ ఎపిసోడ్‌లో ఇంటి సభ్యురాలు దివ్యా అగర్వాల్ ఫన్నీగా తను కరణ్‌ను నామినేట్ చేయాలి అనుకుంటున్నట్లు తెలిపింది.
అయితే దీన్ని సీరియస్‌గా తీసుకున్న కరణ్.. తనకు గౌరవం ఇవ్వకూడదు అనుకుంటే అసలు ఆలోచించకు అని వార్నింగ్ ఇచ్చాడు. బిగ్ బాస్ తనను హోస్ట్‌గా నియమించారని, దివ్యను కంటెస్టెంట్‌గా తీసుకొచ్చారన్న కరణ్.. తనతో గేమ్ ఆడేందుకు ప్రయత్నించొద్దు అని హెచ్చరించాడు. కాగా కరణ్ నుంచి ఇలాంటి రెస్పాన్స్ ఎక్స్‌పెక్ట్ చేయని నెటిజన్లు.. కామెంట్ చేస్తున్నారు.ఈ క్రమంలో సింగర్ సుయాష్ రాయ్ కరణ్ జోహార్ లూజర్ అని కామెంట్ చేశాడు. ఇతరులకు మర్యాద ఇస్తేనే.. నీకు కూడా రెస్పెక్ట్ ఇస్తారని, లేదంటే అలాంటివి ఎక్స్ పెక్ట్ చేయకూడదని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దివ్యా అగర్వాల్‌కు సపోర్ట్‌గా నిలిచిన ఆయన.. కరణ్ తనకు వేలు చూపిస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదన్నాడు. షమితా శెట్టి విషయంలో ఇలాగే బిహేవ్ చేస్తావా? అని ప్రశ్నించాడు.