నన్ను,నా భార్యని వేధిస్తున్నారు : నూతన్ నాయుడు

by Anukaran |
నన్ను,నా భార్యని వేధిస్తున్నారు : నూతన్ నాయుడు
X

దిశ, వెబ్ డెస్క్ : బిగ్ బాస్ ఫేం నూతన్ నాయుడు మరోసారి హాట్ టాపిగ్గా మారారు. శిరోముండనం కేసులో నిందితులైన బిగ్‌బాస్ ఫేం నూతన్‌నాయుడు దంపతులు ఓ యువకుడు తమని వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నూతననాయుడు, ఆయన భార్య మాధురి ప్రియతో కలిసి విశాఖ నుంచి హైదరాబాద్‌ కారులో వెళ్తుండగా..నామవరం దగ్గర తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన జి.భవానీశంకర్‌ ఓ యువకుడు తమను బెదిరించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కాగా ఈ ఏడాది ఆగస్ట్‌లో శిరోమండనం కేసులో నూతన్ నాయుడు దంపతులు అరెస్టైన విషయం తెలిసిందే. ఇంట్లో పనిచేసే బాధితుడు చెప్పకుండా మానేయడంతో అతన్ని పిలిచి మాట్లాడారు. గతంలో ఇంటికి వచ్చిన బ్యూటీషియన్‌ సెల్‌ఫోన్‌ హ్యాక్‌ చేశాడని, సెల్ ఫోన్ పోయిందని నెపం వేశారు. ఆ తర్వాత బాధితుడికి బలవంతంగా గుండు కొట్టించారు. దీంతో బాధితుడు శ్రీకాంత్‌ పెందుర్తి పోలీసులకు శిరోముండనం గురించి ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నూతన్ నాయుడితో పాటు శిరోముండనానికి సహకరించిన నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

అనంతరం కొద్దిరోజులకు బెయిల్ పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో తమని వేధిస్తున్నారంటూ నూతన్ నాయుడు దంపతులు పోలీసుల్ని ఆశ్రయించడం చర్చాంశనీయంగా మారింది.

Advertisement

Next Story