- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కరోనాతో 14 రోజుల్లో తమ్ముడు, నానమ్మ మృతి: నటి ఆవేదన

దిశ, సినిమా: బిగ్ బాస్ ఫేమ్ నిక్కీ తంబోలి హార్ట్ ఫెల్ట్ నోట్ షేర్ చేసింది. కరోనా తన కుటుంబంలో ఎలాంటి విషాదాన్ని నింపిందో ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. కొవిడ్ కారణంగా 14 రోజుల వ్యవధిలో తన నానమ్మను, తమ్ముడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేసింది. తమ లైఫ్‌లో సంభవించిన ఈ మేజర్ లాస్‌ను తన తల్లిదండ్రులు ఎలా భరించగలరో అర్థం కావడం లేదని ఎమోషనల్ అయింది నిక్కీ. ఈ సందర్భంగా ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేసిన ఆమె.. తల్లిదండ్రుల పెదవులపై ఎప్పుడూ చిరునవ్వు ఉండాలని, వారికి ఈ బాధను భరించగలిగే శక్తి ఇవ్వాలని దేవుడిని వేడుకుంటున్నట్లు తెలిపింది.
ఇక తన తమ్ముడిని తలచుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ లైన్స్ షేర్ చేసింది నిక్కీ. ‘తమ్ముడు ఒంటరిగా వెళ్లలేదు.. మాలో సగభాగాన్ని తీసుకుని వెళ్లాడు’ అని భావోద్వేగానికి గురైన ఆమె.. దేవుడు తనని ఇంటికి ఆహ్వానించినప్పుడు అందమైన జ్ఞాపకాలను వెంట తీసుకొచ్చాడని తెలిపింది. తను వెళ్లిపోవడం ద్వారా ఫ్యామిలీ చైన్ విరిగిపోయినట్లు ఉందని, అయినా దేవుడు ఒకరి తర్వాత ఒకరిని పిలిచి మళ్లీ ఆ చైన్ లింక్‌ను కలుపుతాడనే నమ్మకం ఉందని పోస్ట్ పెట్టింది.