అదే ఆమె చేసిన తప్పు.. షమితా శెట్టిపై సల్మాన్‌కు ఫిర్యాదు

by Shyam |   ( Updated:2023-08-18 15:21:28.0  )
Shamita Shetti, Pratik
X

దిశ, సినిమా: సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా బిగ్ బాస్ సీజన్ 15 ఇటీవలే ప్రారంభం కాగా.. కంటెస్టెంట్ల మధ్య అప్పుడే మనస్పర్థలు తలెత్తడం చూస్తున్నాం. ఇక ఇటీవలే ముగిసిన బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ నుంచి ముగ్గురు కంటెస్టెంట్లు సీజన్ 15లో జాయిన్ అయ్యారు. ఈ రోజు ఎపిసోడ్‌లో షమితా శెట్టి, ప్రతీక్ సెహజ్‌పాల్, నిషాంత్ భట్ ఎంట్రీ ఉండనుండగా.. వేదికపై సల్మాన్‌తో ఇంటరాక్షన్ టెలికాస్ట్ కానుంది. ఈ మేరకు కలర్స్ టీవీ రిలీజ్ చేసిన ప్రోమోలో బిగ్ బాస్ ఓటీటీలో షమితా శెట్టి ఏవైనా మిస్టేక్స్ చేసిందా? అని ప్రతీక్‌ను ప్రశ్నించాడు సల్మాన్. అందుకు సమాధానమిచ్చిన ప్రతీక్.. ‘ఆమె చాలా పక్షపాతంగా ఉంటుంది. ఏదైనా విషయంపై నియంత్రణ లేకపోవడం తనకు నచ్చదు’ అని తెలిపాడు. కానీ తను అలాంటిదాన్ని కాదని, పక్షపాతం చూపనని చెప్పిన షమిత.. తాను ఎవరినీ బలవంతం చేయలేదని చెప్పింది.

ఇక ప్రతీక్, నిశాంత్ మంచి స్నేహితులు కదా అని సల్మాన్ అడిగితే.. ‘మేము బిగ్ బాస్ OTTలో స్నేహితులం, కానీ బిగ్ బాస్ 15 హౌస్‌లో మంచి స్నేహితులుగా ఉంటామో లేదో ఖచ్చితంగా తెలియదు’ అంటూ స్మార్ట్‌గా ఆన్సర్ ఇచ్చాడు ప్రతీక్. బిగ్ బాస్ OTTలో నిశాంత్ ఫస్ట్ రన్నరప్, షమిత సెకండ్ రన్నరప్ కాగా ప్రతీక్ నాల్గవ స్లాట్‌ పొందాడు. టైటిల్‌ను దివ్య అగర్వాల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed