డెలాయిట్‌, బీఎస్‌ఆర్‌ ఆడిటింగ్ సంస్థలకు ఊరట!

by Harish |
డెలాయిట్‌, బీఎస్‌ఆర్‌ ఆడిటింగ్ సంస్థలకు ఊరట!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ మాజీ ఆడిటర్ సంస్థలైన బీఎస్ఆర్ అండ్ సోసియేట్స్, డెలాయిట్ హాస్కింగ్స్ అండ్ సెల్స్‌కు ముంబై హైకోర్ట్‌లో ఊరట లభించింది. ఈ సంస్థలపై ప్రాసిక్యూషన్‌ను కొట్టేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఆర్థిక అవకతవకల ఆరోపణలపై నేషనల్ లా ట్రిబ్యునల్‌తో పాటు ముంబై ప్రత్యేక కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ఆడిటర్లుగా తొలగించాలంటూ ఎన్‌సీఎల్‌టీకి ప్రభుత్వం ధరఖాస్తు చేసింది. దీనికి సంబంధించి సంస్థలు ముంబై హైకోర్ట్‌లో ఆడిటింగ్ సంస్థలు సవాలు చేయడం జరిగింది. సెక్షన్ 140(5) కంపెనీల చట్టం కింద ఆడిటింగ్ సంస్థలపై విచారన జరిపి, ఆడిటింగ్ చేసి ఐదేళ్ల నిషేధం విధించాలనేది ప్రభుత్వ వాదన. ఈ కేసుని చీఫ్ జస్టిస్ బీపీ ధర్మాధికారి, జస్టిస్ ఎన్ఆర్ బోర్కర్ బెంచ్ తీర్పు ఇస్తూ…ఎన్‌సీఎల్‌టీ వద్ద సంస్థలపై జరుగుతున్న విచారణను రద్దు చేసింది. కంపెనీల చట్టంలో ఉన్న సెఖ్సన్ 140(5) ఈ కేసుకు వర్తించదని పేర్కొంది.

Tags: Deloitte, Auditors, IL&FS, HC Ruling, KPMG, Nclt

Advertisement

Next Story

Most Viewed