- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘పొన్నియిన్ సెల్వన్’ రిలీజ్ అప్‌డేట్.. అయోమయంలో ఫ్యాన్స్

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించినప్పటికీ అభిమానులు అయోమయంలోనే ఉన్నారు. సినిమా రెండు భాగాలుగా రానుండగా.. మొదటి పార్ట్ విడుదల తేదీపై ప్రస్తుతానికి మూవీ యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది.
అయితే ఈ అప్‌డేట్ పట్ల కొంతమంది ఫ్యాన్స్ ఖుష్ అవుతుంటే.. మరికొందరు మాత్రం నిరాశగా ఉన్నారు. ఎందుకంటే ‘పొన్నియిన్ సెల్వన్’ ఫస్ట్ పార్ట్(PS-1) 2022 వేసవిలో విడుదలవుతుందని ముందుగా భావించినా.. జూలై 2022 తర్వాతే ప్రేక్షకుల ముందుకు రానునట్లు మేకర్స్ రీసెంట్‌గా వెల్లడించారు. వీఎఫ్‌ఎక్స్, మిగతా పనులకు ఎక్కువ సమయం తీసుకుంటున్నందునే జూలై-ఆగస్టు మధ్య రిలీజ్ ఉంటుందని చెబుతున్నారు. కాగా చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్ బచ్చన్, త్రిషా కృష్ణన్, జయరామ్, ప్రకాష్ రాజ్, శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రానికి ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.