- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పవన్ కల్యాణ్‌కు బిగ్ షాక్.. కీలక నేత షర్మిల పార్టీలోకి జంప్
తెలంగాణ బ్యూరో : సినీ నటుడు పవన్ కల్యాణ్ కు షాక్ తగిలింది. జనసేన పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి నరాల సత్యనారాయణ బుధవారం లోటస్ పాండ్ లో వైఎస్ షర్మిల సమక్షంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేరారు. కాగా షర్మిల ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ, రాష్ట్రంలో వైఎస్సార్ పాలనను తిరిగి తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. తెలంగాణకు షర్మిల లాంటి బలమైన నాయకత్వం అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తోందని, కుటుంబ పాలనతో ప్రజలు విసుగెత్తి పోయారని కేసీఆర్ సర్కార్ పై విమర్శలు చేశారు.
వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయన్నారు. తెలంగాణలో దాదాపు 50కి పైగా సాగు నీటి ప్రాజెక్టులు నిర్మించి, రైతులకు సాగు నీరు అందించిన మహనీయుడు వైఎస్సార్ అని కొనియాడారు. ఇదిలా ఉండగా నరాల సత్యనారాయణ సామాజిక ఉద్యమకారుడిగా పలు పోరాటాలు చేశారు. అంతేకాకుండా జనసేన పార్టీ తరుపున ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. తెలంగాణ ప్రైవేట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం, తెలంగాణ మేధావుల ఫోరం అధ్యక్షుడిగా సత్యనారాయనణ పని చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ టీపీ అధికార ప్రతినిధి పిట్టా రాంరెడ్డి, వైఎస్సార్ విగ్రహాల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ నీలం రమేశ్ పాల్గొన్నారు.