చిత్రపురి కాలనీలో భారీ స్కాం : కళ్యాణ్

by Shyam |
చిత్రపురి కాలనీలో భారీ స్కాం : కళ్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్ : సినీ కార్మికుల కోసం నిర్మిస్తున్న చిత్రపురి కాలనీ నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని సీనియర్ నటుడు ఓ.కళ్యాణ్ ఆరోపించారు. చిత్రపురి కాలనీలో నిజమైన అర్హులకు ఇళ్లు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 10న చిత్రపురి కాలనీ హోసింగ్ సొసైటీ ఎన్నికల నేపథ్యంలో ఆయన తన ప్యానల్ సభ్యులతో కలిసి మంగళవారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన 67 ఎకరాల్లో చిత్రపురి కాలనీని నిర్మిస్తున్నారని గుర్తు చేశారు. గత 20 ఏళ్లుగా అక్కడ అవినీతి జరుగుతుందని విమర్శించారు. 2001, 2005, 2010, 2015 ఇలా ప్రతిసారి చిత్రపురి హౌసింగ్ లో సినీ కార్మికుల సొమ్మును అక్కడున్న కమిటీలోని 11 మంది సభ్యులు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు అక్కడ రూ.300 కోట్లకు పైగా స్కామ్ జరిగిందని ఆరోపించారు.

చిత్రపురి కాలనీ నిర్మాణాన్ని ఐవిఎఫ్ఆర్ సంస్థకు రూ.600 కోట్లకు కాంట్రాక్టు ఇచ్చారని, వాటిల్లోనూ అక్రమాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. తాను అన్ని సాక్ష్యాధారాలతోనే మాట్లాడుతున్నాయని వివరించారు. ప్రభుత్వం ఇచ్చిన కోట్లాది రూపాయలు కూడా నేడు కనిపించడం లేదని ఆరోపించారు. బాధితుల పక్షాన పోరాడి అందరికి ఇళ్లు ఇప్పేంచే ప్రయత్నం చేస్తామని ఓ.కళ్యాణ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్ కావూరి, ఈశ్వర ప్రసాద్ మీసాల, కస్తూరి శ్రీనివాస్, బి.నరసింహరెడ్డి, పసునూరి శ్రీనివాసులు, మన్యవాసి వైవి, శ్రీనివాస కూనపరెడ్డి, ఆత్మకూరు రాధా, మల్లికా టి, మధు జాటోత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed