- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలియక భోజనం పెడితే బెదిరింపులా !
X
దిశ, న్యూస్‌బ్యూరో: ఇంటికి వచ్చినవారికి భోజనం పెడితే మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్లు కాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. భద్రాచలం నియోజకవర్గంలో పులిగుండాల సర్పంచ్ చలపతిని పోలీసులు అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేస్తున్నారని, రాష్ట్రంలో పోలీసుల వైఖరి దుర్మార్గంగా ఉందని అన్నారు. మావోయిస్టుల భావజాలం ఉంటే సర్పంచ్ ఎన్నికల్లో చలపతి పోటీచేసే వాడు కాదని, వచ్చినవారు ఎవరో తెలియక భోజనం పెడితే మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్లు కాదన్నారు. సర్పంచ్ చలపతిని వెంటనే రిలీజ్ చేయాలని కోరుతూ మంగళవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్ది సంపత్ కుమార్ డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్ సర్పంచులను వేధించడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Advertisement
Next Story