- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ద్రోహి సీఎం కేసీఆర్ : భట్టి విక్రమార్క
దిశ,వెబ్‌డెస్క్
అసలైన తెలంగాణ ద్రోహి సీఎం కేసీఆర్ అని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో తెలంగాణాను నిలువెల్లా దోచుకుంటున్నాడని శనివారం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ దుర్మార్గాలను బయట పెడుతున్నామనే కారణంతో కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.వివరాల్లోకివెళితే.. కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు ఖమ్మం జిల్లాలో తలపెట్టిన జలదీక్షను అడ్డుకున్న పోలీసులు భట్టి విక్రమార్కను హౌస్ అరెస్టు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మౌనం చాలా ప్రమాదకరమని రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా మౌనం వీడి ప్రశ్నించాలన్నారు. టీఆర్‌ఎస్ చేస్తున్న ఘోరాలను బట్టబయలు చేస్తున్నామనే తమపై నిర్భందాలు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ప్రజలదేనన్న విషయం మర్చిపోవద్దని హితవు పలికారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో ప్రజాధనం కొల్లగొడుతున్నారని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని సూచించారు.