'ఆయన మహోన్నతమైన వ్యక్తి' అంటూ కీర్తించిన వేణుగోపాలచారి

by Sridhar Babu |   ( Updated:2021-10-20 08:48:28.0  )
Madhyam-Matthu12
X

దిశ, అంబర్ పేట్: ప్రముఖ కూచిపూడి నృత్య గురువు పద్మభూషణ్ వెంపటి చినసత్యం మహోన్నతమైన వ్యక్తి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ అధికార ప్రతినిధి సముద్రాల వేణుగోపాలచారి కీర్తించారు. ఆర్. కె. కళా సాంస్కృతిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘భారతీయ కళా వైభవం’ కార్యక్రమం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సముద్రాల వేణుగోపాలచారి హాజరై ప్రసంగించారు. భారతీయ కళా వైభవం పేరిట కళాకారులను ప్రోత్సహిస్తున్న డాక్టర్ రంజిత్ ను అభినందించారు. అనంతరం వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం అవార్డును ప్రదానం చేశారు. లయన్ చిల్లా రాజశేఖర్ రెడ్డి సభాధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సినీ నటి రాగిణ, సంఘ సేవకురాలు దాసరి రమ్య, వేంగాళాస్ పుడ్ అధినేత ఎల్లా సుబ్బారెడ్డి, టీఎస్పీ కార్యదర్శి రామచంద్రారావు, డాక్టర్ రంజిత్, నాట్య గురువులు కాంతారావు, కె. దశరథ, రాధిక, రవి, తులసి, సాయి, వెంకటేశ్ పాల్గొన్నారు.

Advertisement

Next Story