- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం మమతా బెనర్జీకి గవర్నర్ వార్నింగ్
దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధనకర్ వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి జరిగింది. అయితే దీనిపై స్పందించిన సీఎం మమతా బెనర్జీ… బీజేపీ ర్యాలీలో కార్యకర్తలు లేరని, ఆ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే నడ్డా కాన్వాయ్‌పై దాడి చేయించారని మమతా బెనర్జీ ఆరోపించారు. తాజాగా ఆమె వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర గవర్నర్ ధనకర్ స్పందించారు. దాడి ఘటనపై మమత చేసిన కామెంట్లకు ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా అలా స్పందించడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. అంతేగాకుండా బెంగాల్‌లో శాంతిభధ్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ విషయంపై కేంద్ర హోంశాఖకు లేఖ రాశానని హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించే వారికి పోలీసులు రక్షణ కల్పిస్తున్నారని మండిపడ్డారు. కాగా బెంగాల్ రాజధాని కోల్‌కతాకు 50 కిలోమీటర్ల దూరంలో జేపీ నడ్డా ప్రయాణిస్తున్న వాహనంపై దాడి జరిగింది. అయితే ఈ దాడిని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేశారని బీజేపీ ఆరోపించింది.