రూ.30లక్షలతో సుంద‌రీక‌ర‌ణ పనులు ప్రారంభం

by Shyam |
రూ.30లక్షలతో సుంద‌రీక‌ర‌ణ పనులు ప్రారంభం
X

సీఎం జన్మదినం సందర్భంగా మెట్టుగూడ స‌మీపంలోని ఆలుగ‌డ్డ బావి జంక్ష‌న్ వ‌ద్ద రూ.30ల‌క్ష‌ల‌తో చేసిన‌ సుంద‌రీక‌ర‌ణ ప‌నుల‌ను డిప్యూటీ స్పీక‌ర్ టి.ప‌ద్మారావు, మేయర్ బొంతు రామ్మెహన్‌లు సంయుక్తంగా ప్రారంభించారు. అనంతరం దివ్యాంగుల‌కు ట్రై సైకిళ్ల‌ను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా వీరు మాట్లాడుతూ.. 400 ఏండ్లకు పైబ‌డిన చ‌రిత్ర ఉన్న హైద‌రాబాద్‌లోని జంక్ష‌న్ల‌ను ఆయా ప్రాంత ప్ర‌జ‌ల సంస్కృతీ సాంప్ర‌దాయాలు ప్ర‌తిబింబించే విధంగా సుంద‌రీక‌ర‌ణ చేస్తున్నట్టు తెలిపారు. న‌గ‌రాన్ని శోభాయ‌మ‌యంచేసి ప్ర‌జ‌ల‌కు ఆహ్లాద‌క‌ర అనుభూతిని క‌లిగించ‌ట‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని తెలిపారు. సంగీత్ జంక్ష‌న్‌, ల‌క్డికాపూల్‌, న‌ల్గొండ జంక్ష‌న్‌, ఎల్బీన‌గ‌ర్ జంక్ష‌న్‌ల‌తో పాటు మ‌రో 20 కూడ‌ళ్ల‌ను ద‌శ‌ల‌వారిగా అభివృద్ది చేయ‌నున్న‌ట్లు తెలిపారు. హైద‌రాబాద్‌కు వ‌చ్చిన సంద‌ర్శ‌కుల‌కు తీపిగుర్తుగా నిలిచేందుకు ఈ సుందరీకరణలు దోహ‌ద‌ప‌డుతాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్య‌క్ర‌మంలో సికింద్రాబాద్ జోన‌ల్ క‌మిష‌న‌ర్ బి.శ్రీ‌నివాస్‌రెడ్డి, బ‌యోడైవ‌ర్సిటీ విభాగం అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ కృష్ణ‌, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story