- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓయూ నుండి కేయూ వరకు పాదయాత్ర చేస్తా : జాజుల
దిశ, భువనగిరి రూరల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం యాదాద్రి-భువనగిరి జిల్లా వలిగొండ పట్టణ కేంద్రంలోని సాయిగణేష్ పంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాజుల పాల్గొని మాట్లాడుతూ… కరోనా సాకుతో రాష్ట్రప్రభుత్వం విద్యాసంస్థలు ఓపెన్ చేయడం మాసేసి, బార్లు, వైన్సులు విచ్చలవిడిగా ఓపెన్ చేస్తోందని మండిపడ్డారు. ఉపాధ్యాయులకు, లెక్చరర్లకు, ప్రొఫెసర్లకు, 18 ఏళ్లు నిండిన ప్రతి విద్యార్థికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా వేయాలని, కార్పొరేట్ విద్యా సంస్థలను పూర్తిగా నియంత్రించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తక్షణమే డీఎస్సీ నోటిఫికేషన్ వేసి టీచర్ పోస్టులు భర్తీ చేయాలని జేఎల్, డీఎల్ పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేయాలని ఆయన కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న 40 లక్షల మంది పేద విద్యార్థులకు కంప్యూటర్లు, టాబ్‌లు, స్మార్ట్ ఫోన్లు ప్రభుత్వమే సమకూర్చాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా.. ప్రభుత్వ పాఠశాలలను కుదించకుండా ఢిల్లీ తరహాలో కార్పొరేట్ స్థాయిలో పాఠశాలలను నిర్మించి మౌలిక వసతులను కల్పించాలని కోరారు. ఈ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే జులైలో రాష్ట్రవ్యాప్తంగా సైకిల్ యాత్ర చేపడతామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. త్వరలోనే ఓయూ నుంచి కేయూ వరకు పెద్ద ఎత్తున పాదయాత్ర నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో యదాద్రి జిల్లా అధ్యక్షులు కొత్త నర్సింహస్వామి, జిల్లా యువజనసంఘం అధ్యక్షులు మధు, మండల అధ్యక్షులు సాయిని యాదగిరి, లక్ష్మీనారాయణ, రమేష్, మల్లేశ్ గౌడ్, బాలరాజు, వెంకటేష్, భాస్కర్ పాల్గొన్నారు.