బీసీ క్రీమీ లేయర్‌ను ఎత్తివేయాలి: మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Shyam |
బీసీ క్రీమీ లేయర్‌ను ఎత్తివేయాలి: మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోడీ దేశానికి ప్రధాని అయినా ఒరిగిందేమీ లేదని, కనీసం బీసీల సంక్షేమం కోసం మంత్రిత్వశాఖను కూడా ఏర్పాటు చేయలేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీల పట్ల ఆ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో దీన్నిబట్టి తెలిసిపోతోందన్నారు. బీసీలకు అమలవుతున్న క్రీమీ లేయర్ విధానాన్ని వెంటనే ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

ఓబీసీ సెంట్రల్ కమిటీ ఆదివారం నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. బీసీ కులాలు ఐక్యమత్యంతో ఉండి న్యాయమైన డిమాండ్లను సాధించుకోవాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం బీసీల ఆత్మగౌరవం కోసం వేల కోట్ల రూపాయల విలువైన భూములను, ఆర్థిక వనరులను కేటాయించిందని, కానీ కేంద్రం నుంచి మాత్రం ఆ తరహా చొరవ లేదన్నారు.

Advertisement

Next Story

Most Viewed