- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
200 గబ్బిలాల కళేబరాలు.. కొత్త వైరస్ కారణమా ?
ఇప్పటికే కరోనా వైరస్‌తో అతలాకుతలం అవుతోన్న ప్రపంచానికి మరో కొత్త వైరస్ రూపంలో ముప్పు ఉండనుందా ? బీహార్‌లో 200కు పైగా దొరికిన గబ్బిలాల కళేబరాలు ఈ అనుమానాలకు తావిస్తున్నాయి. అయితే అలాంటిదేమీ లేదని శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నా అక్కడి ప్రజలు వినిపించుకోకుండా వదంతులను వ్యాపింపజేస్తూ అనవసర భయాలకు లోనవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
బీహార్‌లోని భోజ్‌పురి జిల్లాకు దక్షిణంగా 55 కి.మీ.ల దూరంలోని తరారీ ప్రాంతంలో వందల కొద్దీ గబ్బిలాల కళేబరాలు పడి ఉన్నాయని సమాచారం అందుకున్న ఆరోగ్య అధికారులు అక్కడికి వెళ్లారు. ఒంటి మీద ఎలాంటి గాయాలు కానీ, రక్తం కానీ లేకుండా ఊరికే శవాల్లా పడిఉండటంతో వారికి అనుమానం వచ్చింది. దీంతో వెంటనే గబ్బిలాల కళేబరాల నోటి నుంచి శాంపిల్స్ తీసుకుని పరీక్షల కోసం పాట్నాలోని యానిమల్ హజ్బెండరీకి పంపించారు. అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న జనం వినిపించుకోకుండా ఫొటోలు తీసి, కరోనా కారణంగానే చనిపోయాయని, కొత్త వైరస్ వచ్చిందని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారని డాక్టర్ సిద్‌నాథ్ రాయ్ అన్నారు. అంతేకాకుండా బర్డ్ ఫ్లూ వచ్చిందని పుట్టుకొస్తున్న పుకార్లకు కూడా ఆయన సమాధానమిచ్చారు. గబ్బిలాలు క్షీరదాలు అవడం వల్ల వాటికి బర్డ్ ఫ్లూ రాదని, అలాగే ఇప్పుడున్న వేడికి బర్డ్‌ఫ్లూ వైరస్ క్రియాశీలకంగా ఉండదని డాక్టర్ సిద్‌నాథ్ రాయ్ వివరించారు. అయితే పరీక్షల ఫలితాలు వస్తే గానీ గబ్బిలాలు చనిపోవడానికి కారణం తెలియదని ఆయన పేర్కొన్నారు.