- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెస్సీతో నాకేం విభేదాలు లేవు
దిశ, స్పోర్ట్స్: బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్ ఫార్వర్డ్ ఆటగాడు ఆంటోని గ్రిజ్‌మన్, తోటి ఆటగాడు లియోనీ మెస్సీ మధ్య వివాదం చెలరేగినట్లు వార్తలు వెలువడ్డాయి. బార్సిలోనా జట్టుకు మెస్సీ అన్నీ తానై నడిపించిన సమయంలో చాలా కఠినంగా వ్యవహరించాడని.. అప్పుడే గ్రిజ్‌మన్ కెరీర్‌లో తొక్కవేయబడ్డాడని అతడి మాజీ ఏజెంట్ ఎరిక్ ఓహట్స్ వ్యాఖ్యానించింది. ఏకంగా గ్రిజ్‌మన్ సన్నిహితురాలే ఈ వ్యాఖ్యలు చేయడంతో మెస్సీతో ఏదో వివాదం నడుస్తుందని ఫుట్‌బాల్ వర్గాలు చర్చించుకున్నాయి.
గ్రిజ్‌మన్ బంధువు ఒకాయన కూడా మెస్సీ వంటి దిగ్గజంతో సుదీర్ఘ కాలం ఒకే క్లబ్‌లో ఆడటం కలసి రాలేదని అన్నాడు. దీనిపై గ్రిజ్‌మన్ స్పందిస్తూ.. ‘గత కొంత కాలంగా ఇలాంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మాజీ ఏజెంట్ నా చెల్లెలు. ఆమె ఈ మాటలు అనలేదు. ఆమె వేరే ఉద్దేశంతో అని ఉండొచ్చు కానీ.. మెస్సీ విషయంలో కాదు. నాకు మెస్సీ అంటే ఎంతో గౌరవం ఉంది. ఆయనతో నాకు ఎలాంటి విభేదాలు లేవు’ అని అన్నాడు. కాగా, మెస్సీ బార్సిలోనా క్లబ్‌ను వీడిపోతున్న వార్తలు వచ్చిన దగ్గర నుంచి క్లబ్‌లోని విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.