సీపీఎల్‌‌లో బరిలో డిఫెండింగ్ ఛాంపియన్‌

by Shyam |   ( Updated:2020-08-17 11:57:36.0  )
సీపీఎల్‌‌లో బరిలో డిఫెండింగ్ ఛాంపియన్‌
X

దిశ, స్పోర్ట్స్: కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) మొదలైనప్పటి నుంచి కొనసాగుతున్న బార్బడోస్ ట్రైడెంట్స్ జట్టు (Barbados Tridents Team)ఇప్పటికీ రెండు సార్లు టైటిల్ (Title) గెలుచుకుంది. 2014లో మొదటి సారి టైటిల్ గెలిచిన ఈ జట్టు ఆ తర్వాత మెరుగైన ప్రదర్శన చేయలేదు. 2018లో పాయింట్ల పట్టిక (Table of points)లో 6వ స్థానంలో నిలిచిన బార్బడోస్ టీమ్ (Barbados Tridents) గత సీజన్‌లో ఏకంగా టైటిల్ (Title)ఎగరేసుకొని పోయింది.

రేపటి నుంచి ప్రారంభం కానున్న సీపీఎల్ 8వ సీజన్‌ (CPL 8th Season)లో డిఫెండింగ్ ఛాంపియన్‌ (Defending Champion)గా బరిలోకి దిగుతున్నది. గత రెండు సీజన్లలో కెప్టెన్‌గా ఉన్న జాసన్ హోల్డర్ (Jason Holder), ఈ ఏడాది కూడా కొనసాగుతున్నాడు. అయితే, ఈసారి జట్టులోకి 10 మంది కొత్త ఆటగాళ్లు (New players) చేరారు. ఈ టీమ్‌లో దాదాపు అందరూ టీ20 స్పెషలిస్ట్ ప్లేయర్లే (T20 specialist player). దీంతో మిగిలిన జట్లతో పోల్చుకుంటే బార్బడోస్ ట్రైడెంట్స్చ (Barbados Tridents) జట్టు బలంగా కనిపిస్తున్నది. ఈ ఏడాది కూడా టైటిల్ నిలబెట్టుకొని మూడోసారి విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతున్నది.

ఆల్‌రౌండర్లే ఎక్కువ:

బార్బడోస్ ట్రైడెంట్స్ జట్టు (Barbados Tridents team)లో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్లు (Specialist batsmen) కేవలం ఇద్దరే ఉండగా, 11మంది ఆల్‌రౌండర్లు (All-rounder) ఉండటం గమనార్హం. కెప్టెన్ జాసన్ హోల్డర్ (Captain Jason Holder), జట్టు యాజమాన్యం ఏరికోరి ఆల్‌రౌండర్ల (All-rounder)ను ఎంపిక చేశారు.

వీళ్లు బ్యాట్‌తోపాటు బాల్‌ (Bating, Bowling)తోనూ జట్టును ఆదుకునే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్ (Australia, England, Pakistan) ఆటగాళ్లు అందుబాటులో లేకుంటే మాత్రం ఈ జట్టు భారీగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. మొత్తం లోకల్ ప్లేయర్ల (Local Players)తో ఆడాలంటే వారిలో అనుభవం ఉన్నవాళ్లు తక్కువగా ఉన్నారు. జట్టు భారమంతా జాసన్ హోల్డర్, షామ్రా బ్రూక్స్, షాయ్ హోప్, ఆష్లీ నర్స్ (Jason Holder, Shamra Brooks, Shay Hope, Ashley Nurse) వంటి వారిపై పడే అవకాశం ఉంది.

కాగా, ఈ జట్టులో కీలక సభ్యుడు ఆఫ్గన్ బౌలర్ రషీద్ ఖాన్ (Afghan bowler Rashid Khan). అతను బౌలింగ్‌ (Bowling)తోనే కాకుండా ఈ మధ్య బ్యాటింగ్‌ (Bating)తో కూడా ఆకట్టుకుంటున్నాడు. ఐపీఎల్, బీబీఎల్‌ (IPL, BBL)లో అతని బ్యాటింగ్ ప్రదర్శన (Batting performance)అద్భుతంగా ఉంది. దీంతో అతడు కీలకంగా మారనున్నాడు. వెస్టిండీస్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న ట్రెవర్ పెన్నీ (Trevor Penny) ఈ జట్టుకు కోచ్‌గా పని చేస్తున్నాడు. అతని కోచింగ్ ప్రతిభతోనే గత సీజన్‌లో బార్బడోస్ జట్టు (Barbados Tridents)టైటిల్ ఎగరేసుకొని పోయింది.

పూర్తి జట్టు

జాసన్ హోల్డర్ (కెప్టెన్) (Jason Holder), షామ్రా బ్రూక్స్ (Shamarh Brooks), అలెక్స్ హేల్స్ (Alex Hales), జోనాతాన్ కార్టర్ (Jonathan Carter), హేడెన్ వాల్ష్ జూనియర్ (Hayden Walsh Jr), మార్కస్ స్టోయినిష్ (Marcus Stoinish), కోరీ ఆండర్సన్ (Corey Anderson), మిచెల్ సాట్నర్ ( Mitchell Santner), జస్టిన్ గ్రీవ్స్ (Justin Greaves), నీమ్ యంగ్ (Nyeem Young), కైలీ మేయర్స్ (Kyle Mayers), జాషువా బిషప్ (Joshua Bishop), షాయాన్ జహంగీర్ (Shayne Jahangir), షాయ్ హోప్ (shai hope), జాన్సన్ చార్లెస్ (Johnson Charles), రహ్మానుల్లాహ్ గుర్బాజ్ (Rahmanullah Gurbaj), ఆష్లే నర్స్ (Ashley Nurse), రేమాన్ రీఫర్ (Raymon Reifer), రషీద్ ఖాన్ (Rashid Khan), హారీ గుర్నీ (Harry Gurney), కియోన్ హార్డింగ్ (Keon Harding) ప్లేయర్స్ ఉన్నారు.

కోచ్: ట్రెవోర్ పెన్నీ (Coach: Trevor Penny)
యజమాని: మనీష్ పటేల్ (సీఎంజీ కంపెనీస్) (Owner: Manish Patel (CMG Company)
హోం గ్రౌండ్: కెన్సింగ్టన్ ఓవల్ (Home Ground: Kensington Oval)

గత ప్రదర్శన: 2014, 2019 విజేత (Past Performance: 2014, 2019 Winner)

Advertisement

Next Story

Most Viewed