- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతర్జాతీయ స్థాయిలో.. బాపూఘాట్ అభివృద్ధి
దిశ, మహబూబ్‌నగర్: లంగర్ హౌస్‌లోని బాపూఘాట్‌ను సుందరంగా, అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి తీరుతామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్‌లోని బాపూ ఘాట్‌ను సందర్శించారు. మంత్రి కేటీఆర్ సూచనల మేరకు బాపూఘాట్ అభివృద్ధిపై హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి అధికారులను ఆదేశించారు. ఘాట్‌లో ఉన్న పురాతనబావి, ధ్యాన కేంద్రం, ల్యాండ్ స్కెపింగ్, గార్డెనింగ్, ఫూట్‌పాత్‌లు అభివృద్ధి చేయాలని సూచించారు. ఓపెన్ ఆడిటోరియంలతో పాటు బాపూ ఘాట్‌కు ఆనుకోని ఉన్న దహన వాటిక ఘాట్‌లను మూసీ కాలువకు అటువైపుకు షిఫ్ట్ చేసి మహా ప్రస్థానం మాదిరిగా తీర్చిదిద్ది అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ముఖ్యంగా వాష్‌రూమ్‌లు, వాటర్ సౌకర్యం, పార్కింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. అందుకు అవసరమైన ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను కోరారు. ఆయనతో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.