బ్యాంకు ఉద్యోగులు సస్పెండ్

by Shyam |   ( Updated:2020-07-30 23:21:45.0  )
బ్యాంకు ఉద్యోగులు సస్పెండ్
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: బాదేపల్లి కేంద్ర సహకార బ్యాంకులో ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ డీసీసీబీ సీఈవో ప్రకాశ్‌రావు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రోజువారీ డిపాజిట్‌ ఏజెంట్‌ ద్వారా జరిపిన లావాదేవీల్లో అక్రమాలు జరిగిన సంఘటనపై అప్పటి మేనేజర్‌ కుబేరుడు, మరో ఉద్యోగి ప్రభాకర్‌లను సస్పెండ్‌ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్థానిక మేనేజర్‌ కుబేరుడు రోజు వారీ డిపాజిట్ల స్వీకరణలో అజాగ్రత్తగా ఉండటంతోనే అక్కడ అవకతవకలు జరిగాయని, వాటిపై ఇంకా పూర్తి స్థాయి విచారణ చేస్తామని పేర్కొన్నారు.

Advertisement
Next Story

Most Viewed