చివరి మజిలీ జైలు మాత్రమే: బండి

by Shyam |   ( Updated:2020-06-25 03:59:23.0  )
చివరి మజిలీ జైలు మాత్రమే: బండి
X

దిశ, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ ఆధ్వర్యంలో సరైన పరిపాలన కొనసాగుతలేదని, కేసీఆర్ తీరుతో రాష్ట్రంలో అప్రక్రటిత ఎమర్జెన్సీ నెలకొన్నదన్నారు. కేసీఆర్ అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం నిర్వహిస్తామన్నారు. కేంద్రం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ జేబులు నింపదు కాబట్టే కేసీఆర్ కు నచ్చలేదన్నారు. కేసీఆర్ చివరి మజిలీ జైలు మాత్రమే అని, ముఖ్యమంత్రితోపాటు మంత్రుల చిట్టా కూడా తయారు చేస్తున్నామని సంజయ్ అన్నారు.

Advertisement

Next Story