- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రత్యేక ప్యాకేజీపై బండి సంజయ్ ఏమన్నారంటే..!
దిశ, న్యూస్‌బ్యూరో: కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక ప్యాకేజీ వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కొనియడారు. కరోనా విపత్కర సమయంలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన పథకాల్లో రూ.లక్ష కోట్లు వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధికి కేటాయించడం జరిగిందన్నారు. మార్కెట్ యార్డుల నిర్మాణం పై దృష్టి సారించడం మైక్రో వుడ్ ఎంటర్ ప్రైజెస్ కోసం రూ.10వేల కోట్లతో కొత్త పథకం తీసుకువచ్చారని తెలిపారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన ద్వారా మత్స్య రంగానికి రూ. 20వేల కోట్లు కేటాయించి చేపల ఉత్పత్తి, ఎగుమతులు పెంచేలా చర్యలు తీసుకుందన్నారు. నిత్యావసరాల చట్ట సవరణకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షదాయకమన్నారు. నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించడానికి తీసుకున్న నిర్ణయాలతో దేశం స్వావలంబన దిశగా అడుగులు వేయడం ఖాయమన్నారు.