- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మగ పాము లేకున్నా ముసలి కొండచిలువ గుడ్లు..
దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలోని మిస్సోరీలో ఉన్న సెయింట్ లూయిస్ జూలో పనిచేసే నిపుణులు ఇప్పుడు రెండు విషయాలు అర్థంకాక తలలు గోక్కుంటున్నారు. అందుకు కారణం ఒక బాల్ పైథాన్ అంటే కొండచిలువ పాము. వారికి వచ్చిన సమస్య ఏంటంటే..ఆ ఆడ కొండ చిలువ వయస్సు 62 ఏండ్లు. గత 20 ఏండ్లుగా ఒంటరిగా తన బోనులో తాను జీవిస్తుంది. కానీ, ఇటీవల ఈ పాము ఏడు గుడ్లు పెట్టింది. చుట్టుపక్కల మగ పాము లేకుండా గుడ్లు ఎలా పెట్టింది? అక్కడి నిపుణులను ఇబ్బంది పెడుతున్న మరో విషయం ఏంటంటే..సాధారణంగా ఈ బాల్ పైథాన్‌లు 60 ఏళ్లకు రావడానికి ముందే గుడ్లు పెట్టడం ఆపేస్తాయి. మరి ఈ కొండచిలువ గుడ్లు ఎలా పెట్టగలిగింది? అనేది తెలియాలి.
ఈ రెండు ప్రశ్నల్లో మొదటిదానికి దాదాపుగా సమాధానం దొరికింది. ఇలాంటి పాముల్లో సంభోగం అవసరం లేకుండానే గుడ్లు పెట్టే శక్తి ఉంటుందట. తమ చుట్టుపక్కలా ఎలాంటి మగ పాము లేదని అర్థమయ్యాక, జాతి అంతరించిపోతోందనే తరుణంలో ఆడ పాములు తమ లోపలే వీర్యకణాలు, అండాలను ఉత్పత్తి చేసుకోగలిగి గర్భం దాల్చే లక్షణాన్ని కలిగి ఉంటాయి. కానీ, రెండో ప్రశ్నకు మాత్రం వారికి ఇంకా సమాధానం దొరకలేదు. అందుకే ఈ కొండచిలువ జన్యువులలో ఏదైనా ప్రత్యేక జన్యువు ఉందేమో తెలుసుకోవడానికి పెట్టిన ఏడు గుడ్లలో రెండింటిని జన్యు పరీక్షలకు పంపించారు. మిగతా ఐదు గుడ్లలో రెండు పాడైపోగా, మూడు గుడ్లు ఆరోగ్యంగా ఉన్నాయని వచ్చే నెలలో పిల్లలు బయటికొచ్చే అవకాశం ఉందని జూ ఆఫీసర్లు తెలిపారు.