- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రూ. 3 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ సాధించిన బజాజ్ ఫిన్‌సర్వ్
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఆర్థిక సేవల సంస్థ బజాజ్ ఫిన్‌సర్వ్ అరుదైన ఘనతను సాధించింది. సోమవారం నాటి మార్కెట్ల ర్యాలీ నేపథ్యంలో కంపెనీ మొదటిసారిగా రూ. 3 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువను సాధించింది. స్టాక్ మార్కెట్లు రికార్డు గరిష్ఠాలను సాధిస్తుండటంతో కంపెనీలు షేర్లు పుంజుకున్నాయి. ఈ క్రమలోనే సంస్థ మార్కెట్ క్యాప్ ఈ రికార్డును సాధించిన 18వ కంపెనీగా నిలిచింది. ప్రస్తుతం అక్టోబర్ నెలలో మాత్రమే కంపెనీ 7.4 శాతం పుంజుకోగా, ప్రస్తుత ఏడాదిలోనే ఏకంగా 114 శాతం పెరిగింది. కొవిడ్ మహమ్మారి ప్రతికూల పరిస్థితుల వల్ల కొంత ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ వృద్ధికి అవసరమైన పలు చర్యలు తీసుకున్నామని, ఈ నెలలోనే బజాజ్ ఫిన్‌సర్వ్ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్)ను స్పాన్సర్ కోసం సెబీ నుండి సూత్రప్రాయ ఆమోదం అందుకుంది. ఇప్పటికే కరోనా సెకెండ్ వేవ్ మహమ్మారి పరిణామాలను అధిగమించి ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని కంపెనీ అభిప్రాయపడింది. ఎన్‌బీఎఫ్‌సీ పరిశ్రమలు టెక్నాలజీ వినియోగంతో వృద్ధి సాధిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.