కొత్త ఆర్థిక ప్యాకెజీపై బైడెన్ సంతకం

by vinod kumar |
కొత్త ఆర్థిక ప్యాకెజీపై బైడెన్ సంతకం
X

దిశ,వెబ్‌డెస్క్: ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అమెరికా ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. 1.9 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ కార్యనిర్వహక ఆదేశాలపై అధ్యక్షుడు బైడెన్ సంతకం చేశారు. అమెరికన్ల కోసం ది అమెరికన్ రెస్క్యూ ప్లాన్ పేరుతో కొత్తపథకాన్ని ప్రవేశ పెట్టారు. ఒక్కో అమెరికన్ పౌరుడి బ్యాంకు ఖాతాలోకి 2వేల డాలర్లు జమ చేయనున్నారు. పౌరులకు ఇప్పటికే చెల్లించిన 600 డాలర్లు సరిపోవని బైడెన్ అభిప్రాయ పడ్డారు. ప్రజలను ఆకలితో ఉండనీయమని బైడెన్ స్పష్టం చేశారు. అద్దె కట్టలేని ఇండ్లను ఖాళీ చేయించకుండా ఆంక్షలు విధించాలని పేర్కొన్నారు.

Next Story

Most Viewed