- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఫ్లాష్ ఫ్లాష్ : మెరిసిన పీవీ సింధు.. భారత్ ఖాతాలో మరో పతకం..?

దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అద్భుతంగా రాణిస్తోంది. క్వాలిఫైయింగ్ మ్యాచుల్లో దూకుడుగా ఆడిన పీవీ సింధు క్వాటర్ ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. తాజాగా క్వార్టర్ ఫైనల్‌లో యమగూచి(జపాన్)పై పీవీ ఘన విజయం సాధించి బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో సెమీస్‌కు దూసుకెళ్లింది. తొలి సెట్లో 21-13, రెండో సెట్లో 22-20 పీవీ సింధు మ్యాచ్ ఆరంభం నుంచి ఆధిక్యం కనబరించింది. రెండో సెట్లో కాస్త తడబడినా తిరిగి తేరుకున్న తెలుగుతేజం తన దైన శైలితో ప్రత్యర్థికి చుక్కలు చూపించింది.
కాగా, సెమీస్‌లో గెలిస్తే భారత్‌కు మరో పతకం ఖాయం కానుంది. ఇదిలాఉండగా 2016 బ్రెజిల్‌లో జరిగిన రియో ఒలంపిక్స్ లో సింధు రజత పతకం గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం జరుగుతున్న టోక్యో ఒలంపిక్స్‌లో భారత్‌కు ఏ విభాగంలోనూ గోల్డ్ మెడల్ రాలేదు. పీవీ సింధు సెమీస్‌లోనూ సత్తా చాటి ఎలాగైనా గోల్డ్ మెడల్ తీసుకురావాలని యావత్ భారతం ఆశగా ఎదురుచూస్తోంది.