- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దిశ, బూర్గంపాడు : ఉమ్మడి ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో టీకా వికటించి చిన్నారి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సారపాకకు చెందిన సందీప్-నాగలక్ష్మి దంపతుల చిన్నారి (మూడు నెలలు) టీకా వేయించేందుకు బుధవారం సారపాక సబ్ సెంటర్‌కు తీసుకువచ్చారు. కాగా, టీకా వేశాక ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో చిన్నారి అపస్మారక స్థితికి చేరుకుని మృతి చెందింది. టీకా వికటించడంతోనే తమ చిన్నారి మరణించిందని, తమకు న్యాయం చేయాలని చిన్నారి కుటుంబ సభ్యులు సబ్ సెంటర్ వద్ద ఆందోళన చేపట్టారు. సంబంధిత వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని నిరసనకు దిగారు.
దీంతో కొద్దిసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. అడిషనల్ డీఎంహెచ్ఓ దయానందస్వామి, తహశీల్దార్ భగవాన్ రెడ్డి, ఎస్సై సముద్రాల జితేందర్ వైద్యాధికారి డాక్టర్ స్పందన.. సబ్ సెంటరుకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం చిన్నారి మృతదేహాన్ని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇందులో అదనపు ఎస్సై బాజానసీరుద్దీన్, ఆర్ఎస్ఐలు అక్బర్ బాబు, శంకర్ నాయక్, హెచ్ఐవో రవి పాల్గొన్నారు.