- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అలీసాగర్ కాలువలో తేలియాడిన పసికందు

X
దిశ, బోధన్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులోని లక్ష్మి నరసింహస్వామి టెంపుల్ ద్వారం వద్ద గల అలీసాగర్ మెయిన్ కెనాల్‌లో అప్పుడే పుట్టిన మగశిశువు మృతదేహాన్ని గుర్తించారు.దీనిని శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించారు. గ్రామ శివారులోని కెనాల్‌లో అప్పుడే పుట్టిన శిశువును నిన్న అర్ధరాత్రి లేదా తెల్లవారు జామున పడవేసి ఉంటారని గ్రామస్థులు అనుమానిస్తున్నారు.
సమాచారం అందుకున్న ఎడపల్లి పోలీసులు మృతదేహాన్ని బోధన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సర్పంచ్, గ్రామస్థుల ఫిర్యాదు మేరకు శవపరీక్ష చేయిస్తామని ఏఎస్సై రాజు తెలిపారు. శిశువును ఎవరు పడవేసి ఉంటారనే కోణంలో విచారణ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
Next Story