ఎమ్మెల్సీ బీటెక్‌ రవికి 14 రోజుల రిమాండ్‌

by srinivas |
ఎమ్మెల్సీ బీటెక్‌ రవికి 14 రోజుల రిమాండ్‌
X

దిశ, ఏపీబ్యూరో : చెన్నైలో ఆదివారం అరెస్టయిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని పోలీసులు సోమవారం పులివెందుల మెజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచారు. బీటెక్‌ రవికి 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఆయన్ని కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు.

2018లో పులివెందుల పూల అంగళ్ల వద్ద అల్లర్లు, ఘర్షణ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీటెక్‌ రవిపై వారెంట్‌ పెండింగ్‌లో ఉంది. రాళ్ల దాడి, హత్యాయత్నం కేసులో ఇన్నాళ్లూ ఆయన బెయిల్‌ తీసుకోలేదు.

Advertisement

Next Story