- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘భారత్‌లో ఉన్న వైరస్ అత్యంత ప్రమాదకరం’
దిశ, వెబ్ డెస్క్ : భారత్‌లో కరోనా విలయతాడవం చేస్తుంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ లోని డబుల్ మ్యూటెంట్ రకం ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌లో వ్యాప్తిలో ఉన్న బి.1.617 డబుల్ మ్యాటెంట్ రకం. దీనిని డబ్లూహెచ్ ఓ ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్ ఎట్ గ్లోబల్ లెవల్’గా గుర్తించింది. ఇవన్నీ చైనాలోని వూహాన్‌లో పుట్టిన అసలు వైరస్ కంటే ప్రమాదకరమైనవని ఇది అత్యంత వేగంగా ఇతరులకు సోకుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ టెక్నికల్ లీడ్ మారియా వాన్ కెర్‌కోవ్ పేర్కొన్నారు. అయితే బి.1.617 వేరియంట్‌ను గతేడాది అక్టోబరులో మన దేశంలో తొలిసారి గుర్తించారు. ఈ మ్యూటెంట్ వల్ల ప్రపంచం మొత్తానికి ప్రమాదం ఉందని, ఈ జాబితాలో ఇప్పటికే బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ స్ట్రెయిన్లు ఉన్నాయిన్నారు.
అందుకనే దీనిని ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా ప్రకటించినట్టు చెప్పారు. వ్యాక్సిన్ల ద్వారా శరీరంలో ఏర్పడే యాంటీబాడీల రక్షణ నుంచి ఇది తప్పించుకోగలుగుతుందా అనేదానిపై పరిశోధనలు జరుగుతున్నాయని వివరించారు. ఇది చికిత్స, టీకాలకు లొంగదన్న ఆధారాలేవీ లేవన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌లో అందుబాటులో ఉన్న రెండు వ్యాక్సిన్లు వైరస్ దాడి నుంచి రక్షణ కల్పిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు.