- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AXIS BANK త్రైమాసిక నికర లాభం రూ. 1,112 కోట్లు!
ప్రైవేట్ రంగంలో అతిపెద్ద బ్యాంక్ వ్యవస్థ అయిన యాక్సిస్ బ్యాంక్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి నికర లాభం 19 శాతం క్షీణతతో రూ. 1,112 కోట్లుగా వెల్లడించింది. ఇతర ఆదాయాలు కూడా గణనీయంగా తగ్గాయని బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ. 1,370 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 20 శాతం పెరిగి రూ. 6,985 కోట్లకు చేరుకుంది. సమీక్షించిన త్రైమాసికంలో నికర వడ్డీ మార్జిన్ 3.40 శాతంగా ఉన్నట్టు బ్యాంక్ ప్రకటించింది. వడ్డీయేతర ఆదాయం గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 33 శాతం తగ్గి రూ. 2,587 కోట్లకు చేరుకుంది. ఇతర ఆదాయాలు గతేడాది ఇదే త్రైమాసికానికి రూ. 373 కోట్లు ఉండగా, ఈసారి రూ. 311 కోట్లకు తగ్గాయి. అలాగే, తొలి త్రైమాసికంలో బ్యాంక్ నిర్వహణ లాభం 1 శాతం తగ్గి రూ. 5,844 కోట్లుగా నమోదైంది.
‘కరోనా సంక్షోభం వల్ల తీవ్ర అంతరాయం ఏర్పడిందని, ఆర్థిక సామాజిక అవరోధాలకు దారి తీసిందని యాక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈవో అమితాబ్ చౌదరీ చెప్పారు. అయితే, బ్యాంకింగ్ రంగంలో అనేక మార్పులకు కూడా కరోనా కారణమైందని అమితాబ్ వెల్లడించారు. ఈ రంగంలో యాక్సిస్ బ్యాంక్ ముందంజలో ఉందని, సంస్థను బలోపేతం చేసే కొత్త పరిష్కారాలతో నిరంతరం కొనసాగుతామని, వాటాదారులతో కలిసి పనిచేయడం, సవాళ్లను ఎదుర్కొంటూ కస్టమర్లు, ఉద్యోగులు, భాగస్వాములకు మద్దతుగా ఉంటామని అమితాబ్ చౌదరి వెల్లడించారు. ఇక, జూన్ త్రైమాసికానికి బ్యాంక్ కేటాయింపులు 15.8 శాతం పెరిగి రూ. 4,416.42 కోట్లకు చేరుకున్నాయి. ఇది గత త్రైమాసికంతో పోలిస్తే 42.9 శాతం తగ్గాయి. కాగా, తొలి త్రైమాసికంలో స్థూల నిరర్ధక ఆస్తుల్(ఎన్‌పీఏ) నిష్పత్తి 5.25 శాతం నుంచి 4.72 శాతానికి తగ్గింది. నికర ఎన్‌పీఏ నిష్పత్తి 2.04 శాతం నుంచి 1.23 శాతానికి తగ్గింది.