కిరాణా దుకాణంలో పనిచేశా :అవినాష్

by Shyam |
కిరాణా దుకాణంలో పనిచేశా :అవినాష్
X

దిశ, వెబ్‌డెస్క్: జబర్దస్త్‌లో కమెడియన్‌గా పాపులరైన అవినాష్.. బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చి, తన కామెడీ టైమింగ్‌తో అందరినీ నవ్వించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున నుంచి బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా కాంప్లిమెంట్స్ కూడా అందుకున్నాడు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో లైఫ్‌లో పడిన కష్టాల గురించి వివరించాడు అవినాష్. యాక్టర్‌గా మారాలనే తన కలను నిజం చేసుకునేందుకు.. బీటెక్ అయ్యాక యాక్టింగ్ స్కూల్‌లో జాయిన్ అయినట్లు తెలిపాడు. కానీ రూమ్ రెంట్, ఫుడ్ కోసం ఇంట్లో డబ్బు అడిగి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, పార్ట్ టైమ్ జాబ్ చేసేవాడినని చెప్పాడు. యాక్టింగ్ క్లాసులు అయిపోయాక కిరాణా దుకాణంలో పనిచేసేవాడినని.. రాత్రుళ్లు ఐస్ క్రీమ్ కూడా అమ్మేవాడినని చెప్పుకొచ్చాడు అవినాష్. కాగా జబర్దస్త్‌లో కొంత ఫేమ్ సంపాదించి సెట్ అవుతున్న టైమ్‌లోనే లాక్‌డౌన్ వచ్చిందని, దీంతో అప్పటి వరకు దాచుకున్న డబ్బులన్నీ అయిపోయాయని.. ఇంటి కోసం తీసుకున్న లోన్లు, ఈఎమ్‌ఐలు కట్టలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు వెల్లడించాడు.

అయితే, బిగ్ బాస్ తనకు మంచి ఫ్లాట్‌ఫామ్ అయిందని అభిప్రాయపడ్డ అవినాష్.. తన ఆర్థిక ఇబ్బందులను తీర్చడంతో పాటు టాలెంట్‌ను బయటపెట్టిందన్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి మంచి అవకాశం ఇస్తానని బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్‌లో మాటిచ్చారని, తన పిలుపుకోసం వెయిట్ చేస్తున్నానని తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed