- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ పోలీస్ హెల్ప్.. రెండేళ్లుగా బయటకురాని తతంగం
దిశ ప్రతినిధి, నిజామాబాద్: రోహింగ్యాలను నిజామాబాద్ జిల్లా భోదన్ వాసులుగా గుర్తించి పాస్ పోర్టుల జారీ చేసిన విషయంపై అధికారులు కూపీ లాగుతున్నారు. గతంలో భోదన్‌కు చెందిన వ్యక్తులు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి విదేశాలకు వెళ్తుండగా ఇమిగ్రేషన్ అధికారులు అనుమానంతో వారి పాస్ పోర్టులను వెరిఫై చేయడంతో అసలు విషయం బయటపడింది. అందుకు భాధ్యులైన ఒక ఎస్ఐ, ఏఎస్ఐతో పాటు ఏజెంట్‌ను ఎయిర్ పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మయన్మార్‌కు చెందిన రోహింగ్యాలను భోదన్ వాసులుగా పాస్ పోర్టు విచారణలో రెండేండ్ల క్రితం స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్స్ క్లియరెన్స్ ఇవ్వడంతో వారికి పాస్ పోర్టులు జారీ అయ్యాయి. ప్రస్తుతం సిద్దిపేట్‌లో ఎస్ఐగా పనిచేస్తున్న మల్లేశ్ (గతంలో నిజామాబాద్ హెడ్ కానిస్టేబుల్) ఇంట్లో అద్దెకు ఉన్న ఏజెంట్ ద్వారా 72 మందికి పాస్ పోర్టులు జారీ అయినట్టు అధికారులు గుర్తించారు.
అందులో ఒకే ఇంటి నుంచి 32 మందికి పాస్ పోర్టులు జారీ కావడం గమనార్హం. అనిల్ అనే హెడ్ కానిస్టేబుల్ సహకారంతోనే ఈ తతంగం రెండేండ్లుగా బయటకు రాలేదు. పాస్ పోర్టుల జారీ విషయంపై కేంద్ర విదేశాంగ శాఖ, హోంమంత్రిత్వ శాఖకు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పోలీస్ శాఖ ప్రాథమిక సమాచారం మేరకు 72 పాస్ పోర్టులను గుర్తించి అందుకు బాధ్యులైన సిద్దిపేటలో పని చేస్తున్న ఎస్ఐ మల్లేష్, నిజామాబాద్ ఏఎస్ఐ అనిల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో నిజామాబాద్ అధికారులు అంతర్గత విచారణ చేపట్టారు. రోహింగ్యాలకు నివాసం ఉన్న, అనుమానం ఉన్న ప్రాంతాల్లో రెండేండ్ల కాలంలో జారీ అయిన పాస్‌పోర్టుల వివరాలను సేకరిస్తున్నారు. ఒక ఏసీపీ ద్వారా ఈ విచారణ సాగుతున్నట్టు సమాచారం. రోహింగ్యాలకు పాస్‌పోర్టుల జారీని ప్రభుత్వ సిరీయస్‌గా తీసుకోని విచారణ నివేదిక ఇవ్వాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్టు తెలిసింది. ఇంక ఎంత మంది రోహింగ్యాలు స్థానికంగా ఉన్నారు, వారు ఎలాంటి గుర్తింపు పత్రాలు పొందారనే విషయాలపై విచారణ కొనసాగుతోందని సమాచారం.