‘దిశ’ క‌థ‌నానికి కదిలిన అధికారులు.. భారీ మొత్తంలో సీజ్..

by Shyam |
sand
X

దిశ‌, హ‌త్నూర‌: జోరుగా సాగుతున్న దందా.. అటువైపు కన్నెత్తి చూడని అధికారులు.. అనే శీర్షికతో దిశ దిన ప‌త్రిక‌లో ప్రచురించిన వార్తకు రెవెన్యూ, పోలీసు అధికారులు స్పందించారు. సోమ‌వారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం పరిధిలోని ఇసుక అక్రమ రవాణా చేస్తున్న గ్రామాల‌ను అధికారులు సంద‌ర్శించారు. లింగాపూర్, మల్కాపూర్ గ్రామాల‌లో రెండు ఇసుక ట్రాక్టర్లతో పాటు భారీ మొత్తంలో ఇసుక డంప్‌లను సీజ్ చేశారు. ఇసుకను అక్రమ రవాణా చేయడం కోసం ఆయా గ్రామాల‌లో సిద్ధంగా ఉంచిన ఇసుక డంపుల‌ను తహశీల్దార్‌ పద్మావతి, ఎస్సై లక్ష్మారెడ్డి, ఆర్.ఐ. నవీన్ కుమార్‌తో పాటు రెవెన్యూ, పోలీసు సిబ్బంది సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం వారు మాట్లాడుతూ.. అనుమ‌తులు లేకుండా అక్రమంగా ఇసుక‌ను త‌ర‌లిస్తే చ‌ట్టప‌రంగా క‌ఠిన చ‌ర్యలు తీసుకుంటామ‌ని హెచ్చరించారు. గ్రామాల‌లో అక్రమంగా ఇసుక ర‌వాణా చేస్తే త‌మ‌కు స‌మాచారం ఇవ్వాల‌ని గ్రామస్తులను కోరారు.

Advertisement

Next Story

Most Viewed