పదో తరగతి విద్యార్థితో ఆంటీ రాసలీలలు.. ఆటోలోనే ప్లాన్ చేసి..!

by Anukaran |   ( Updated:2021-11-03 06:42:04.0  )
పదో తరగతి విద్యార్థితో ఆంటీ రాసలీలలు.. ఆటోలోనే ప్లాన్ చేసి..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంటీ.. ఆంటీ.. అంటూ పిలుస్తోన్న ఓ పదోతరగతి విద్యార్థితో 35 ఏళ్ల మహిళ రాసలీలలు కొనసాగించింది. ఇందుకు బాలుడి తల్లిదండ్రులు అడ్డొచ్చారని ప్లాన్ వేసి అతడిని తీసుకొని ఎస్కేప్ అయింది. కొడుకు కనిపించడం లేదని పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన తమిళనాడులోని తిరువారూర్‌ జిల్లాలో వెలుగుచూసింది.

అసలేం జరిగిందంటే..

కూడవాసల్‌‌ ప్రాంతంలో బాలగురు-రసతి దంపుతుల కుమారుడు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. ఇంటి నుంచి స్కూల్‌కు వెళ్లేదారిలో వీధి చివరలో లలిత (35) అనే మహిళ భర్త బాలకృష్ణ, 13 ఏళ్ల కూతురితో నివాసం ఉంటోంది. ఈమె స్థానిక అంగన్‌వాడీ స్కూల్‌‌లో వంట మనిషి. నిత్యం లలిత ఇంటి ముందు నుంచే రాకపోకలు చేసే బాలగురు కొడుకు ఆమెతో పరిచయం చేసుకున్నాడు. వీరి పరిచయం కాస్తా వయసును మరిచి శారీరక సంబంధానికి దారితీసింది. కానీ, ఈ గుట్టు ఆ నోటా ఈ నోటా పడి వీధి మొత్తం పుకార్లు షికార్లు చేశాయి. తొలుత బాలుడి తల్లిదండ్రులు నమ్మకపోయినా.. పలుమార్లు కదలికలపై నిఘా వేయగా వివాహేతర సంబంధం సాగిస్తున్నట్టు గుర్తించారు.

లలితకు శారీరకంగా లొంగిపోయిన కుమారుడిని సక్రమార్గంలో నడిపేందుకు ఆమెకు దూరంగా బంధువుల ఇంటికి పంపాడు తండ్రి బాలగురు. అక్కడి నుంచే స్కూల్‌కి వెళుతూ ఉండేవాడు ఆ బాలుడు. ఇది తెలుసుకున్న సదరు మహిళ గత నెల 26న ఓ ఆటోలో నేరుగా స్కూల్‌కి వెళ్లి, బాలుడిని తీసుకుని పరారీ అయింది. అనంతరం స్కూల్‌ నుంచి తిరిగిరావాల్సిన బాలుడు ఎంతకీ రాలేదు. దీంతో బాలగురు తన కొడుకు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సదరు మహిళతో వివాహేతర సంబంధం ఉండేదని, లలితనే తన కొడుకుని తీసుకెళ్లి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు.

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా..

కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్కూల్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆటో‌ డ్రైవర్‌ను కనిపెట్టారు. అతడిని పిలిచి విచారించగా ‘పూన్‌తొట్టం’ అనే గార్డెన్ వద్ద వదిలినట్టు చెప్పాడు. దీంతో పోలీసులు లలిత మొబైల్‌ నెంబర్లను ట్రేస్ చేస్తున్నారు. సిగ్నల్ లోకేషన్ ఆధారంగా బాలుడిని, నిందితురాలిని పట్టుకుంటామని చెబుతున్నారు. ఇక బాలుడిని ఎత్తుకెళ్లడమే కాకుండా, మైనర్‌‌తో లైంగిక సంబంధం పెట్టుకున్న నేపథ్యంలో ఆమెపై పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడం గమనార్హం. ఇదిలా ఉంటే ఇంట్లో 13 ఏళ్ల కూతురిని పెట్టుకుని తల్లి ఇలాంటి పనిచేసిందేంటని భర్త బాలకృష్ణన్(తాపీ మేస్త్రీ) తలపట్టుకున్నాడు.

భూత వైద్యురాలితో యువకుడు ఎఫైర్.. అర్ధరాత్రి ఇద్దరు కలిసి గుట్టపై ఆ విధంగా.

Advertisement

Next Story