అఘాయిత్యం.. యువతిని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి పారిపోయిన దుండగులు

by srinivas |
rape
X

దిశ, ఏపీ బ్యూరో: తాడేపల్లిలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన మరువకముందే అదే జిల్లాలో మరో దారుణ ఘటన కలకలం రేపింది. స్నేహితుడితో ఉన్న ఇంజినీరింగ్ స్టూడెంట్‌పై అత్యాచారం చేసేందుకు దుండగులు యత్నించారు. వారి అఘాయిత్యాన్ని అడ్డుకునే క్రమంలో బాధితులు గట్టిగా కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. మోతడకలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థిని చదువుతుంది. తన స్నేహితుడితో కలిసి బైక్ పై గుంటూరు వెళ్తుంది. అయితే గుంటూరు శివారులో కొందరు యువకులు వారిపై కర్రలతో దాడి చేశారు. స్నేహితుడిని చితకబాదారు. అనంతరం యువతిని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే యువతి, యువకుడు గట్టిగా కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Next Story