అత్తపై కోడలు హత్యాయత్నం

by Anukaran |
అత్తపై కోడలు హత్యాయత్నం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మల్లేపల్లి ఫిరోజ్‌గాంధీ నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అత్తపై కోడలు హత్యాయత్నం చేసింది. ఈ ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… సౌదీలో ఉన్న తన భర్తతో అత్త మాట్లాడనివ్వడం లేదని… అత్త తస్లీమ్ సుల్తానాపై కోడలు ఉజ్ఞామా బేగం దాడి చేసింది. దీంతో కోడలిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో అత్తమామలు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు, కేసు నమోదు చేసుకున్నారు. గాయపడిన అత్తను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడికి కోడలు తల్లి అసిఫాబేగం సహకరించినట్టు పోలీసులు నిర్ధారించారు.

Advertisement

Next Story