రాజు ENT ఆసుపత్రి పై దాడులు.. కేసు నమోదు..సీజ్..?

by Shyam |   ( Updated:2021-05-20 09:28:20.0  )
Remdesivir injections
X

దిశ, వరంగల్: హన్మకొండ బస్టాండ్ వద్ద గల రాజు ఈఎన్‌టీ హాస్పిటల్‌పై టాస్క్‌ఫోర్స్, డ్రగ్ ఇన్స్పెక్టర్ లు దాడులు నిర్వహించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులకు రెమిడిసివేర్ ఇంజెక్షన్లను బ్లాక్ లో విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా డ్రగ్ ఇన్స్పెక్టర్, టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. డాక్టర్, ఫార్మసీ యజమాని ఇద్దరు కుమ్మక్కై బ్లాకులో అమ్ముతుండడంతో ఆసుపత్రి యజమాని డాక్టర్ రాజు, ఫార్మసీ యజమానిపై 486,420, 51/b,7 of Essential commodities act కింద కేసులు నమోదు చేశారు.

డాక్టర్ రాజు, ఫార్మసీ యజమానిలను హన్మకొండ పోలీసుల అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి 14 రెమిడిసివేర్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్‌కి డాక్టర్ రాసిచ్చిన చిట్టి మేరకు ఇంజెక్షన్లను మొదటి రోజు 35 వేలకు, రెండవ రోజు 27 వేలకు, మూడవరోజు (ఈరోజు) 25 వేలకు ఆసుపత్రి ఫార్మసీ సిబ్బంది అమ్ముతుండగా పోలీసులు దాడులు నిర్వహించారు.

Advertisement

Next Story

Most Viewed