- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నిజామాబాద్ జిల్లాలో వీఆర్ఏపై దాడి

X
దిశ, ఆర్మూర్: మొరం తవ్వకాలను అడ్డుకున్న వీఆర్ఏపై దుండగులు దాడి చేసిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ఓడ్యాట్ పల్లి గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండానే కోందరు వ్యక్తులు అక్రమంగా మొరం తవ్వకాలు చేస్తున్నారనే సమాచారం మేరకు వీఆర్ఏ కిషోర్ అక్కడికి వేళ్లి పనులను నిలిపివేయాలని కోరారు. దీంతో ఇద్దరు వ్యక్తులు అతడి(వీఆర్ఏ)పై దాడి చేశారు. ఈ దాడిలో గాయపడ్డ కిషోర్.. మాక్లూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వీఆర్ఏపై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ గ్రామ రెవెన్యూ ఉద్యోగ సంఘం ఆందోళనకు పిలుపునిచ్చింది.
Next Story