- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘లక్షణాలు కనిపించని కేసులు 80శాతం’
న్యూఢిల్లీ: వైరస్ బారిన పడి కూడా లక్షణాలు కనిపించనివారు మొత్తం కేసుల్లో 80శాతం ఉన్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వైరస్ సోకి కూడా లక్షణాలు కనిపించనివారితోనే ముప్పు అధికంగా ఉంటుందని వివరిస్తున్నారు. మనదేశంలోని 80శాతం కేసులు అసింప్టోమాటిక్ అని మెడికల్ రీసెర్చ బాడీ ఐసీఎంఆర్ సంస్థకు చెందిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రామన్ ఆర్ గంగాఖేద్కర్ తెలిపారు. ఇప్పటి వరకు దేశంలో కరోనా కేసులు 17వేలను దాటాయి. కాగా, లక్షణాలు బయటపడని కరోనా బాధితులు ఎక్కువ మొత్తంలోనే ఉండే అవకాశమున్నదని ఆందోళనలు వెలువడుతున్న తరుణంలో సీనియర్ సైంటిస్టు ఈ అభిప్రాయాన్ని వెల్లడించడం గమనార్హం. లక్షణాలు వెల్లడికాని బాధితుల(అసింప్టోమాటిక్ కేసులు)ను గుర్తించడం చాలా కష్టమని, కరోనా పాజిటివ్ కేసుల కాంటాక్టుల ట్రేసింగ్ ద్వారానే వీరిని గుర్తించవచ్చునని గంగాఖేద్కర్ వివరించారు. మరోమార్గం.. అందరికీ పరీక్షలు నిర్వహించడం.. కానీ, అది అసాధ్యమని పేర్కొన్నారు. దీనికి వేరే ఏదైనా వ్యూహమున్నదా? అని ప్రశ్నించగా.. అవకాశం లేదని తెలిపారు. ఇన్ఫెక్షన్ ఉన్నా.. లేదా హాట్‌స్పాట్‌లలో జలుబు, దగ్గు సంబంధ పేషెంట్లందరినీ టెస్టు చేస్తున్నామని వివరించారు. కాగా, అసింప్టోమాటిక్ కేసులకు సంబంధించి కేజ్రీవాల్ ఆదివారం.. ఓ కీలక వ్యాఖ్య చేశారు. లక్షణాలు బయటపడని 736 మంది నుంచి కరోనా పరీక్ష కోసం శాంపిళ్లు సేకరించగా.. అందులో 186 మందికి పాజిటివ్ వచ్చిందని వెల్లడించిన విషయం చర్చనీయాంశమైంది.
tags: asymptomatic, ICMR, coronavirus, cases, samples, worry