భూమికి ద‌గ్గ‌రగా రాబోతున్న ఆస్ట‌రాయిడ్ ఇదే!

by Shyam |
భూమికి ద‌గ్గ‌రగా రాబోతున్న ఆస్ట‌రాయిడ్ ఇదే!
X

ఒక పెద్ద ఆస్ట‌రాయిడ్ జూన్ 6వ తేదీ నాడు భూమికి ద‌గ్గ‌ర‌గా వెళ్ల‌బోతోంద‌ని ఈ వారం మొద‌ట్లో అమెరికా అంత‌రిక్ష ప‌రిశోధ‌నా కేంద్రం నాసా ప్ర‌క‌టించింది. 250 నుంచి 570 మీట‌ర్ల వ్యాసం ఉండ‌నుంద‌ని నాసా జెట్ ప్రొప‌ల్ష‌న్ ల్యాబోరేట‌రీ (జేపీఎల్) అంచనా వేసింది. దీనికి 163348 (2002 NN4)గా నామ‌క‌ర‌ణం కూడా చేశారు. అంతేకాకుండా దీన్ని పొటెన్షినయ‌ల్ హ‌జార్డ‌స్ ఆస్ట‌రాయిడ్ (పీహెచ్ఏ) కేట‌గిరీ కింద వ‌ర్గీక‌రించారు. అంటే ఈ ఆస్ట‌రాయిడ్ వ‌ల్ల భూమికి ప్ర‌మాదం ఉండే అవ‌కాశం ఉంద‌ని అర్థం.

నాసా వారి నియ‌ర్ ఎర్త్ ఆబ్జెక్టు స్ట‌డీ ద్వారా భూమికి దగ్గ‌ర‌గా వ‌చ్చే ఉల్క‌ల‌ను, వాటి దూరాన్ని నిర్ణ‌యిస్తారు. వాటి గురుత్వాక‌ర్ష‌ణ బ‌లం ఆధారంగా వాటిని తోక‌చుక్క‌లుగా, ఉల్క‌లుగా నాసా వ‌ర్గీక‌రిస్తుంది. ఈ ఉల్క‌లు ఎక్కువ‌గా నీరు, మంచు, దుమ్ము క‌ణాల‌తో నిండి ఉంటాయి. వాటిలో కొన్ని ఆస్ట‌రాయిడ్లు మాత్రం భూమికి న‌ష్టాన్ని క‌లిగించేవి ఉంటాయి. అయితే కొన్ని ఆస్ట‌రాయిడ్లను భూమికి చేరువ‌గా రాక‌మునుపే వాటిని శాటిలైట్ల ద్వారా నాసా విచ్ఛిన్నం చేస్తుంది.

Advertisement

Next Story