- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
భార్య అలా చేసిందని.. కెనాల్‌లో శవమై తేలిన భర్త

దిశ, ఖానాపూర్ : మద్యం మత్తులో కెనాల్‌లో పడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.ఈ ఘటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం దిల్వార్ పూర్ గ్రామ సమీపంలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఖానాపూర్ ఎస్ఐ రాము కథనం ప్రకారం.. దిలావార్పూర్ గ్రామానికి చెందిన షేక్ ఆసిఫ్ (35) కూలి పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. అతనికి భార్య, కూతురు వున్నారు.
ఈ క్రమంలోనే అతని భార్య కొన్ని రోజుల కిందట ఆసిఫ్‌తో గొడవపెట్టుకొని తన పుట్టింటికి వెళ్ళింది. దీంతో ఆసిఫ్ మద్యానికి బానిసయ్యాడు.ఈనెల 20 తేదీన మధ్యాహ్నం ఆసిఫ్ మద్యం మత్తులో ఉండి కాలకృత్యాల నిమిత్తం తన ఇంటి వెనుకాల గల సదర్మాట్ కెనాల్ వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తూ అందులో పడిపోగా ప్రాణాలు కోల్పోయాడు. ఇవాళ మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్‌ఐ రాము తెలిపారు. మృతుని తల్లి షేక్ జులేక బేగమ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.